Responsive Ads Here

Wednesday, September 20, 2017

How to Create a New GMAIL Account

కొత్త జిమెయిల్ ఎకౌంటు ను ఎలా క్రియేట్ చేయాలి?
జిమెయిల్ అనేది గూగుల్ వారి  వెబ్ ఆధారిత ఇమెయిల్ సిస్టమ్. ఈ ఇమెయిల్ సిస్టమ్ ద్వారా మనము ఉత్తర ప్రత్యుత్తరాలు జరపవచ్చు.  నా బ్లాగ్ ద్వారా జిమెయిల్ ఎకౌంటు ఎలా క్రియేట్ చేయాలో చూపించబోతున్నాను.
మనకు ముందుగా కావలసినది. 
1. ఇంటర్నెట్ కనక్షన్ కలిగినటువంటి కంప్యూటర్. 
జిమెయిల్ ఎకౌంటు ఎలా క్రియేట్ చేయాలో క్రింది వివరిస్తున్నాను, అనుసరించండి. 

మీ కంప్యూటర్ లో బ్రౌసర్ ఓపెన్ చేసి పైన కనిపిస్తున్నా అడ్రస్ బార్ లో http://www.google.co.in అని టైపు చేయడం ద్వారా గూగుల్ యొక్క వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. కుడిచేతి వైపు పైన కనిపించే జిమెయిల్ వర్డ్ పైన క్లిక్ చేయడం ద్వారా మీకు జిమెయిల్ యొక్క హోంపేజి ఓపెన్ అవుతుంది.  

 సైన్ ఇన్ అవ్వమంటూ స్క్రీన్ సూచిస్తూ ఉంటుంది.

 కానీ మనకి న్యూ జిమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయాలి కాబట్టి మోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. 



మోర్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయగానే క్రియాట్ ఎకౌంటు అని చూపిస్తుంది, దాని పైన క్లిక్ చేయండి. క్రియేట్ ఎకౌంటు పైన క్లిక్ చేయగానే క్రియేట్ యువర్ గూగుల్ అకౌంట్ పేజీ ఓపెన్ అవుతుంది. 
పైన ఎడమ వైపుగా ఉన్న బాక్సులలో మీ యొక్క వివరాలను ఇచ్చి నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ చేయండి. 
గూగుల్ వారి టర్మ్స్ అండ్ కండిషన్స్ ను I Agree బటన్ పై క్లిక్ చేసి Accept చేయండి. Accept చేసిన తరువాత క్రింది విధంగా వెరిఫికేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చి టెక్స్ట్ మెసేజ్ రేడియో బటన్ పై క్లిక్ చేసి కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి. 


కంటిన్యూ బటన్ ప్రెస్ చేసిన తరువాత క్రింది విధంగా వెరిఫ్య్ యు ఎకౌంటు పేజీ ఓపెన్ అవుతుంది. వెరిఫికేషన్ కోడ్ బాక్స్ లో మీ మొబైల్ నెంబర్ కి గూగుల్ నుంచి వచ్చిన ఎస్.ఎం.ఎస్ లో ఉన్న కోడ్ ను ఇచ్చి కంటిన్యూ బటన్ ను క్లిక్ చేయండి.   

కంటిన్యూ బటన్ పై క్లిక్ చేసిన తరువాత మీకు క్రింది విదంగా వెల్కమ్ పేజీ ఓపెన్ అవుతుంది. 
మీ యొక్క వెల్కమ్ పేజీ లో కంటిన్యూ టు జిమెయిల్ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా క్రింది విధంగా మీ జిమెయిల్ యొక్క ఇన్బాక్స్ ప్రైమరీ పేజీ ఓపెన్ అవుతుంది. 
గూగుల్ ప్రైమరీ ఇన్బాక్స్ పేజీ లో మీకు వచ్చిన ఇమెయిల్ 'స్ ను ఇన్బాక్స్ పైన క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చును. మరియు ఓపెన్ చేయటం కొరకు ప్రైమరీ టాబ్ క్రింద చూపిస్తున్న టెక్స్ట్ మ్యాటర్ మీద క్లిక్ చేయడం ద్వారా మీకు వచ్చిన ఇమెయిల్ 'స్ ను చూసుకోవచ్చును. 
మీరు జిమెయిల్ కొత్త ఎకౌంటు ఎలా ఓపెన్ చెయ్యాలో ఇప్పటివరకు చెప్పటం జరిగింది. ఇక్కడ నుంచి మీరు మీ యొక్క ఇమెయిల్ ను  వివిధ వెబ్ సైట్స్ లో జాయిన్ అయేటప్పుడు ఉపయోగించవచ్చును. 

నా పోస్టు మీకు నచినట్లైతే మీరు షేర్ చేయగలరు. 
నెక్స్ట్ కంటిన్యూ పోస్ట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.